భారతదేశం ఇప్పుడు తన UPI చెల్లింపు సేవలను మాల్దీవులకు విస్తరించనుంది

52చూసినవారు
భారతదేశం ఇప్పుడు తన UPI చెల్లింపు సేవలను మాల్దీవులకు విస్తరించనుంది
మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవులు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ భారత దేశానికి చెందిన UPIని రూపొందించడానికి మాల్దీవులతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఇది పర్యాటక రంగంపై సానుకూల ప్రభావం చూపుతుందని మంత్రి జైశంకర్ అన్నారు. కాగా, గతేడాది నవంబర్‌లో ప్రెసిడెంట్ మొహమ్మద్ ముయిజ్జూ ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత జైశంకర్ అక్కడ పర్యటించడం ఇదే తొలిసారి.

సంబంధిత పోస్ట్