లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

51చూసినవారు
లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు
దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. వైరస్‌ ఆందోళనల మధ్య సోమవారం భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు ఇవాళ లాభాల బాట పడ్డాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభంతో, నిఫ్టీ 23,700 ఎగువన ట్రేడింగ్‌ మొదలుపెట్టాయి. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 423 పాయింట్లు పెరిగి 41,191 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 137 పాయింట్లు లాభపడి 23,753 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.78 వద్ద కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్