జూన్ 7న భారతీయుడు రీరిలీజ్

56చూసినవారు
జూన్ 7న భారతీయుడు రీరిలీజ్
కమల్ హాసన్ హీరోగా నటించిన ‘భారతీయుడు’ మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో జూన్ 7న రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో మనీషా కోయిరాలా, ఊర్మిళ హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో రికార్డులు బద్దలుకొట్టింది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘భారతీయుడు 2’ జులై 12న విడుదల కానుంది.

ట్యాగ్స్ :