పెళ్లి చేసుకున్న భారత యువ క్రికెటర్

72చూసినవారు
పెళ్లి చేసుకున్న భారత యువ క్రికెటర్
భార‌త యువ క్రికెట‌ర్ జితేశ్ శ‌ర్మ పెళ్లి చేసుకున్నాడు. టీ20 స్పెష‌లిస్ట్‌గా పేరొందిన జితేశ్ శుక్రవారం ఓ ఇంటివాడ‌య్యాడు. వేద పండితుల ఆశీర్వ‌చ‌నాల మ‌ధ్య సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ష‌ల‌క ముకేశ్వ‌ర్‌ను పెళ్లి చేసుకున్నారు. కేవ‌లం ఇరువురి కుటుంబాలు మాత్ర‌మే ఈ వేడుకకు హ‌జ‌ర‌య్యాయి. ఇలా కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో వైభ‌వంగా వీరి ప‌రిణ‌యం జ‌రిగింది. త‌మ పెళ్లి వేడుక ఫొటోల‌ను జితేశ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా అభిమానుల‌తో పంచుకున్నాడు.

సంబంధిత పోస్ట్