ఇందిర భారతమాత.. కేంద్ర మంత్రి క్లారిటీ

50చూసినవారు
ఇందిర భారతమాత.. కేంద్ర మంత్రి క్లారిటీ
మాజీ ప్రధాని ఇందిరాగాంధీని 'భారతమాత'గా పేర్కొన్న తర్వాత ఈ అంశంపై కేంద్ర మంత్రి సురేష్ గోపి ఆదివారం స్పందించారు. తాను హృదయపూర్వకంగా మాట్లాడే వ్యక్తినని, ఇందిరా గాంధీ గురించి తాను మాట్లాడిన దాంట్లో తప్పు లేదని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. ఆమె మరణించే వరకు దేశ నిర్మాణానికి నిజమైన ఆర్కిటెక్ట్‌గా పని చేశారని పేర్కొన్నారు. దేశం కోసం నిజాయితీగా పనిచేసిన వ్యక్తిని తాను మర్చిపోలేనన్నారు.

ట్యాగ్స్ :