TG: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లబ్దిదారులకు అవసరమైన ఇసుకను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇళ్ల నిర్మాణంలో ప్రధానమైన ఇటుకలను మహిళా సంఘాల ద్వారా తయారు చేయించి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ మేరకు ప్రతి మండలానికి 3 ఇటుక తయారీ యూనిట్లు ఏర్పాటు చేయించనుంది. ఈ మేరకు సెర్ప్ ద్వారా ఒక్కో యూనిట్‌కు రూ.18 లక్షల వరకు రుణం అందించాలని డిసైడ్ అయింది. ఈ యూనిట్ల ద్వారా ఇటుకలు సరఫరా చేయనుంది.