సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా డిసెంబర్ 5న ఇందిరమ్మ ఇండ్ల యాప్‌ను ప్రారంభించబోతున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో మంగళవారం పర్యటించి మాట్లాడారు. గత ప్రభుత్వం పదేళ్లలో గ్రామాల్లో ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదని, తాము మొదటి విడతలో రాష్ట్రవ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తున్నామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం ఏ దళారికి రూపాయి ఇవ్వాల్సిన పనిలేదని చెప్పారు.