ప్రయోగానికి సిద్ధమవుతున్న జీశాట్-ఎన్2 ఉపగ్రహం

58చూసినవారు
ప్రయోగానికి సిద్ధమవుతున్న జీశాట్-ఎన్2 ఉపగ్రహం
దేశంలోని మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సేవలను అందించే లక్ష్యంతో ఇస్రో రూపొందించిన జీశాట్-ఎన్2 (జీశాట్-20) ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధమవుతోంది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఉపగ్రహం నింగిలోకి వెళ్లనుంది. సోమవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రయోగం జరగనుంది. అండమాన్ నికోబార్, లక్షద్వీప్ వంటి ద్వీపాల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తేవటమే ఈ ప్రయోగం లక్ష్యం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్