ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా.. పాకిస్థాన్ కు వెళ్లదని ప్రచారం జరుగుతున్న వేళ పాకిస్థాన్ క్రికెటర్ హసన్ అలీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. “మేము భారత్ కు వెళ్లి ఆడినప్పుడు.. వారు కూడా పాకిస్థాన్ రావాలి కదా?. చాలామంది భారత ఆటగాళ్లు పాకిస్థాన్ లో ఆడాలని కోరుకుంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఆటగాళ్లు వారి దేశ విధానాలను, దేశాన్ని, క్రికెట్ బోర్డును పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది” అని అలీ పేర్కొన్నాడు.