AP: గత ప్రభుత్వం కన్నా తమ ప్రభుత్వం చాలా గొప్పగా పనిచేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న అడ్డగోలు నిర్ణయాలపై అధికారులు కూడా ఏమీ చెప్పలేకపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, పని చేసే సంస్కృతి చంపేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం తొలి ఆరు నెలలు, ఈ ప్రభుత్వం ఆరు నెలల పాలనను బేరీజు వేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఆకాశానికి, భూమికి ఉన్నంత తేడా ఉంటుందన్నారు.