మనలో చాలా మందికి ఉదయం, సాయంత్రం టీ తాగే అలవాటు ఉంటుంది. ప్రతిరోజూ లవంగం టీ తాగితే చాలా ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. లవంగాలలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ టీ తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. జలుబు, దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. జీర్ణక్రియ సమస్య కూడా తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.