AP: తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే పోసాని కృష్ణమురళి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఆయనకు ఈసారి భారీ షాక్ తగిలింది. డిప్యూటీ సీఎంపై గతంలో చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై జనసేన నాయకులు ఫిర్యాదు చేయగా.. బుధవారం టీటీడీ చైర్మన్‌ను అవమానించేలా మాట్లాడటంతో గుంటూరు పట్టాభిపురంలో కూడా కేసు నమోదైంది. అయితే పట్టాభిపురంలో కేసు నమోదు కావడంతో పోసానిని అరెస్ట్ చేయాలని కూటమి కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.