జనసేనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు చేరికకు ముహూర్తం ఫిక్స్?

59చూసినవారు
జనసేనలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే దొరబాబు చేరికకు ముహూర్తం ఫిక్స్?
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పిఠాపురం వైసీపీ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు జనసేన పార్టీలో చేరేందుకు దాదాపు సమయం దగ్గర పడింది. ఈ నెల 9 వ తేదీన జనసేన పార్టీలో చేరడానికి పెండెం దొరబాబు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఆయన ఇప్పటికే తన అభిమానులకు సమాచారం అందించారు. దొరబాబుతో పాటు నియోజకవర్గం నుండి నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున జనసేనలో చేరనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్