దేశంలోని మొట్టమొదటి విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను 1961 మార్చి 4న భారత నౌకాదళంలో చేర్చారు. ఇది 64 సంవత్సరాలుగా సేవలలో ఉంది. దీనిని మొదటి, రెండో ప్రపంచ యుద్దంలో బ్రిటిష్ రాయల్ నేవీ కోసం HMS హెర్క్యులస్ నిర్మించారు. 2022లో భారతదేశం మరో INS- విక్రాంత్‌ని నిర్మించింది. ఇది భారతదేశానికి చెందిన మొట్టమొదటి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన విమాన వాహక నౌక అవుతుంది.