తెలంగాణలో మసాజ్ సెంటర్లు.. హైకోర్టు ఆగ్రహం

67చూసినవారు
తెలంగాణలో మసాజ్ సెంటర్లు.. హైకోర్టు ఆగ్రహం
తెలంగాణలో మసాజ్ సెంటర్లు, హుక్కా సెంటర్లపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ను మరో పంజాబ్‌లా చేయాలని చూస్తున్నారా అని అధికారులపై మండిపడింది. హుక్కాలో 200 సిగరెట్లకు సమానమైన విష వాయువులు ఉంటాయని, హుక్కా వినియోగం అనేది సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని తెలిపింది. మసాజ్ సెంటర్ల ద్వారా సమాజం పెడదారిపడుతుందని, ఆడ, మగ ఏదైనా మాసాజ్ సెంటర్లను నిషేధించాలని ఆదేశించింది. వాటిని మూసి వేయాలని ఆదేశించింది.

సంబంధిత పోస్ట్