తెలంగాణ మంత్రివర్గంలో ఆరు ఖాళీలు ఉన్నాయి. మంత్రివర్గంలో ఎవరెవర్ని తీసుకోవాలన్న అంశంపై ఇప్పటికే కొన్ని పేర్లను రేవంత్ రెడ్డి హైకమాండ్ కు సమర్పించారు. అయితే ఆశావహులు చాలా ఎక్కవగా ఉండటంతో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను పెంచవద్దని, ఆయన చెప్పిన వారికి కాకుండా ఇతరులకు మంత్రి పదవులు ఇవ్వాలని పలువురు సీనియర్ నేతలు హైకమాండ్ కు ఫిర్యాదు చేశారని అందుకే గ్రీన్ సిగ్నల్ రాలేదని చెబుతున్నారు.