ఇజ్రాయెల్ ఆయుధాల పేరు చెబితే తొలుత గుర్తుకొచ్చేది ఐరన్ డోమ్. నిప్పుల వర్షంలా ప్రత్యర్థులు రాకెట్లు ప్రయోగిస్తున్నా.. ఉక్కు కవచంలా ఆ దాడులను అడ్డుకొంటుంది. ఐరన్ డోమ్‌ను స్థానికంగా కిప్పాట్ బర్జెల్‌గా వ్యవహరిస్తారు. ప్రత్యర్థులు ప్రయోగించిన మిసైల్ ఎక్కడ నేలను తాకుతుందో ఐరన్ డోమ్ అంచనా వేస్తుంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే వదిలేస్తుంది. అదే జనావాసాలు అయితే మాత్రం రాకెట్‌ను ప్రయోగించి ధ్వంసం చేస్తుంది.