ఢిల్లీలో ఏర్పాటైన బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చలేదని మాజీ CM ఆతిశీ చేసిన విమర్శలపై నూతన సీఎం రేఖా గుప్తా స్పందించారు. కాంగ్రెస్ 15 ఏళ్లు, ఆప్ 13 ఏళ్లు పాలించిన సమయంలో మీరు ఏం చేశారని ప్రశ్నించారు. తాము తొలి రోజే క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ఢిల్లీలో ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించామని వెల్లడించారు. దాంతో ప్రజలకు రూ.10 లక్షల ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్యానించారు.