ఆలయాలకు వెళ్లినప్పుడు కొందరు పువ్వులు తమ వెంట తెచ్చుకుంటారు. మరి కొంతమంది వాటిని అక్కడే వదిలేసి వచ్చేస్తుంటారు. బయటకు వచ్చేటప్పుడు ధ్వజస్తంభం వద్ద పెట్టేవారు మరికొందరు. అయితే, ఆలయం నుంచి వచ్చేటప్పుడు పువ్వులు ఇంటికి తెచ్చుకోవడం మంచిదని పండితులు చెబుతున్నారు. ఆలయంలో ఇచ్చేది ఏదైనా భగవంతుడి ప్రసాదమే. ముఖ్యంగా పువ్వులపై దేవుడి అనుగ్రహం ఉంటుందట. అందువల్ల పువ్వులు తెచ్చుకోవడం మంచిదే.