AP: నూతన సంవత్సరం సందర్భంగా ఒక రోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంగళవారం పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని యల్లమంద గ్రామంలో ఆయన పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు టీడీపీ శ్రేణులు తెలిపాయి. ఉదయం 10.50 గంటలకు సీఎం ఆ గ్రామంలో పింఛన్ల పంపిణీ చేస్తారు. ఆ తర్వాత ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు.