ఇబ్రహీంపట్నం: విద్యుత్ అంతరాయంకు వినియోగదారులు సహకరించాలి
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని గోదుర్, వేములకుర్తి గ్రామాలలో ఉన్న 33/11 కెవి విద్యుత్ ఉప కేంద్రాలలో మరమ్మతులు శనివారం జరుగుతున్నందున గ్రామాలలోని విద్యుత్ వినియోగదారులు సహకారించాలని ఏఇ సతిష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 09: 00 గంటల నుండి మధ్యాహ్నం 12: 00 గంటల వరకు కరెంట్ నిలిపివేయడం జరుగుతుంది. కావున ఈ ఫీడర్స్ పరిధిలో గల విద్యుత్ వినియోగదారులు, రైతులు సహకరించాలని కోరారు.