Apr 15, 2025, 02:04 IST/
త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది: కొత్త ప్రభాకర్ రెడ్డి
Apr 15, 2025, 02:04 IST
TG: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'కాంగ్రెస్ పాలనలో పిల్లలనుంచి పెద్దల వరకు అందరూ విసిగిపోయారు. తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది. రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. వ్యాపారాలు, బిల్డర్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనడానికి కూడా సిద్ధంగా ఉన్నారు' అని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.