BRS ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సృహ తప్పి పడిపోయారు. హుజురాబాద్లో దళిత బంధు డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ధర్నాకు దిగారు. దీంతో అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ క్రమంలోనే కౌశిక్ రెడ్డి సృహ తప్పి పడిపోయాడు. కాస్త మంచి నీళ్లు తాగిన తర్వాత కౌశిక్ రెడ్డి లేచి సీఎం రేవంత్ పై ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి తనపై హత్యాయత్నం చేయిస్తున్నాడని మండిపడ్డారు.