జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ మాల యువజన సంఘంలో ఆదివారం మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు స్వర్గీయ పీవీ రావు, దళిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గుడిసెల (గడ్డం) వెంకటస్వామి ల వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు.