
కోరుట్ల: మోరి నిర్మాణాన్ని త్వరగా చేపట్టండి
కోరుట్ల పట్టణంలోని NH63 ని, తిలక్ రోడ్డు అనుకొని ఒక్క పెద్దమోరి నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలకు, అక్కడి దుకాణా సముదాయాలకు తీవ్ర అడ్డంకిగా మారింది. ఆ మోరీ నుండి చాలా దుర్వాసన, దోమలతో, ఎవరెవరో వచ్చి ఆ పెద్ద మోరిలో చెత్త వేస్తున్నారు. అక్కడి వ్యాపారస్తులు ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతకముందు ఒక వ్యక్తి మద్యం తాగి ఆ మోరీలో పడడం జరిగింది.