రూ.448 కోట్ల వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ (కమ్యూనికేషన్) జైరాం రమేష్ నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ (ఎన్‌టిఎ)ని ఆదివారం నిలదీశారు. గడిచిన ఆరేళ్లలో ఎన్‌టిఎ రూ.448 కోట్ల లాభాలను ఆర్జించిందని.. ఎన్‌టిఎ సమర్థతను పెంచేందుకు, పర్యవేక్షణ సామర్థ్యాలను బలోపేతం చేసేందుకు రూపాయి కూడా ఖర్చు చేయలేదని అన్నారు. ఇటీవల రాజ్యసభలో ఓ ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ ఇచ్చిన ప్రత్యుత్తరాన్ని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.