AP: పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి కార్యకర్తలు, నేతలు తరలివస్తున్నారు. 'జయకేతనం' పేరిట నిర్వహిస్తున్న ఈ సభా వేదికపై 250 మంది కూర్చోనున్నారు. ఎన్ఆర్ఎ ప్రశాంత్ కొల్లిపర ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి సభలకు దీటుగా వేదిక ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. కిలోమీటర్ దూరంలో ఉన్న వారికీ వీఐపీ గ్యాలరీలో ఉన్న అనుభూతి కలిగేలా ఆడియో సిస్టమ్స్ సిద్ధమయ్యాయి.