జూన్‌లోపు అర్హులందరికీ టిడ్కో ఇల్లు: మంత్రి నిమ్మల

62చూసినవారు
జూన్‌లోపు అర్హులందరికీ టిడ్కో ఇల్లు: మంత్రి నిమ్మల
AP: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఎన్టీఆర్ టిడ్కో గృహాల సముదాయ కాలనీ ప్రాంతంలో ప్రధాన కాలువపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. మిగిలిన టిడ్కో గృహాలను పూర్తి చేసి లబ్ధిదారులకు వచ్చే జూన్ నాటికి పంపిణీ చేస్తామని తెలిపారు. సీఎం చంద్రబాబు పేదవారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్