హోలీ పండగ కారణంగా మార్చి 15న జరిగే హిందీ పరీక్షకు హాజరు కాలేకపోతున్న విద్యార్థులకు CBSE బోర్డు మరో అవకాశం ఇస్తోంది. మార్చి 14 హోలీ అయినప్పటికీ, దేశంలో కొన్ని ప్రాంతాలల్లో 15న జరుపుకుంటున్నారు. దీంతో పలువురు విద్యార్థులు పరీక్షలకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో పరీక్ష రాయలేని విద్యార్థుల కోసం ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తామని CBSE పరీక్ష కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ ప్రకటించారు.