AP: కాకినాడలోని పిఠాపురంలో నడిరోడ్డుపై జనసేన జెండాతో వాహనదారుడిపై ఓ వ్యక్తి ఇవాళ దాడికి పాల్పడ్డాడు. చిత్రాడ వద్ద ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు ముందుకు పోవాలని ఓ ద్విచక్ర వాహనదారుడు కోరాడు. అక్కడున్న ఓ వ్యక్తి జనసేన జెండా కర్రతో బైకర్‌పై దాడి చేసి, పారిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.