AP: కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో మరికాసేపట్లో జయకేతనం సభ ప్రారంభం కానుంది. ఈ సభ కోసం రాష్ట్రం నలుమూలల నుంచి జనసేన నాయకులు, అభిమానులు తరలివస్తున్నారు. ఈ సభ కోసం 50 ఎకరాల్లో ఏర్పాట్లు చేశారు. పవన్ సహా 250 మంది వేదికపై కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు. సభ వద్దకు చేరుకునేందుకు 7 గ్యాలరీలు.. 3 మార్గాలు ఏర్పాటు చేశారు. పవన్ మధ్యాహ్నం 3గంటలకు సభ వద్దకు చేరుకోనున్నారు.