రాజ్యసభ సభ్యుడిగా జేపీ నడ్డా ప్రమాణం (వీడియో)

51చూసినవారు
భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డా పెద్దల సభకు నామినేట్‌ అయిన విషయం తెలిసిందే. గుజరాత్‌ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇందులో భాగంగా రాజ్యసభ సభ్యుడిగా శనివారం ప్రమాణం చేశారు. నడ్డాతో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్‌కర్‌ ప్రమాణం చేయించారు. గతంలో నడ్డా హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. ఆయన పదవీ కాలం ఈ నెలతో ముగిసింది.

సంబంధిత పోస్ట్