చెవిలో కాటన్‌బడ్‌ని పెట్టొద్దు

548చూసినవారు
చెవిలో కాటన్‌బడ్‌ని పెట్టొద్దు
చెవిలో గులిమి లేదా ఇయర్ వాక్స్ తీయడం కోసం ఎక్కువ మంది కాటన్ బడ్‌ని ఉపయోగిస్తుంటారు. చెవిలో కాటన్ బడ్ పెట్టడం వల్ల అది ఇయర్ వాక్స్‌ని చెవి లోపలికి మరింతగా నెట్టివేస్తుంది. నిజానికి ఇయర్ వాక్స్ వల్ల చెవులకు లాభమేగానీ నష్టం లేదు. బయటినుంచి వేరే పదార్థాలు, క్రిముల వంటివి చెవి లోపలికి వెళ్లకుండా ఇది రక్షిస్తుంది. శిలీంధ్రాలు లేదా ఫంగస్ ఏర్పడకుండా నివారిస్తుంది. దాని జోలికి వెళ్లకుండా ఉండడమే కరెక్ట్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్