విషాదం.. నీటి ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి

61చూసినవారు
విషాదం.. నీటి ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ ఐదుగురు మృతి
మహారాష్ట్ర ఆర్థిక రాజధాని ముంబైలోని నాగ్పడా ప్రాంతంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నీటి ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ ఐదుగురు కాంట్రాక్టు కార్మికులు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న భవనం వద్ద గల వాటర్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తున్న క్రమంలో ఊపిరి ఆడకపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. అస్వస్థతకు గురైన వారిని ముంబై ఫైర్ బ్రిగాడే హాస్పిటల్ కు తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్