కాకర కాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే ఎ, సి, కె విటమిన్లు ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజాలు, డైటరీ ఫైబర్‌లకు ఇది మంచి మూలం. క్రమం తప్పకుండా ప్రేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంవల్ల ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. శరీరంలో నొప్పిని, వాపును తగ్గిస్తుంది. బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను నియంత్రించడం కారణంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరుస్తుంది.