కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో ఎంసిహెచ్ హాస్పిటల్ ఆవరణలో ఏఐటీయుసీ జెండాను జిల్లా ఉపాధ్యక్షులు దుబాస్ రాములు గురువారం ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఐటీయుసీ అక్టోబర్ 31వ తేదీన ఆవిర్భవించిందని, ఫలితంగా కార్మిక చట్టాలు వచ్చాయని తెలిపారు. కార్మిక వర్గం ఐక్యంగా ఉండాలని, ఐక్యతతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ కార్మికులు రేణుక, సంతోష్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు