బాన్సువాడ: పండరిపూర్ పాదయాత్ర ప్రారంభించిన కౌన్సిలర్ రోహిత్

62చూసినవారు
బాన్సువాడ: పండరిపూర్ పాదయాత్ర ప్రారంభించిన కౌన్సిలర్ రోహిత్
బాన్సువాడ మండలం సోమేశ్వర్ లోని సోమలింగేశ్వర ఆలయంలో సోమవారం పండరీపూర్ పాదయాత్రను కౌన్సిలర్ కాసుల రోహిత్ ప్రారంభించారు. సోమేశ్వర్ నుండి పండరిపూర్ వరకు కాలినడకన పాదయాత్ర కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ పాదయాత్ర రాములు మహారాజ్, నాందేవ్ మహారాజ్ , కబీర్ మహారాజ్, ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ నర్సింలు, నాయకులు మంద సాయిలు, శనిగరం కిషన్, పర్వారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్