కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన లబ్ధిదారునికి శుక్రవారం ఎల్లారెడ్డి శాసనసభ్యులు మదన్మోహన్ ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ నాయకులు సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ యూత్ ఉపాధ్యక్షుడు లక్ష్మణ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కమ్మరి సంగమేష్, నాయకులు సాయిరాం, ఇస్మాయిల్, ఆంజనేయులు పాల్గొన్నారు.