భారీగా కురుస్తున్న వర్షానికి నీట మునిగిన పంటలు

85చూసినవారు
భారీగా కురుస్తున్న వర్షానికి నీట మునిగిన పంటలు
బాన్సువాడ మండలంలోని పలు గ్రామాలలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పంటలు నీట మునిగాయి. దీంతో అన్నదాతలు దిగాలు చెందుతున్నారు. పంట అంతా నీట మునిగిపోవడంతో చేసేదేమీ లేక అన్నదాత దిగాలు చెందుతున్నారు. భారీగా కురుస్తున్న వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నీట మునిగిన పంటలకు నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్