రుద్రూర్ మండల పరిధిలోని అక్బర్ నగర్ గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మంచిని కిష్టయ్య ని నియమించినట్లు రుద్రూర్ మండల తెరాస పార్టీ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ శుక్రవారం ప్రకటించారు. ఈ సందర్భంగా పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ.. కిష్టయ్య అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ ని సమర్దవంతముగా ముందుకు నడిపిస్తూ కార్యకర్తలను, నాయకులను సమన్వయం చేసుకునే అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని మంచిని కిష్టయ్య ను అక్బర్ నగర్ తెరాస గ్రామ అధ్యక్షుడి గా నియమించినట్లు తెలిపారు.. ఈ సందర్భంగా వారికీ కృతజ్ఞతలు తెలిపారు.