బాన్సువాడ నియోజకవర్గానికి సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులు శుక్రవారం తార్నాకలోని ప్రొఫెసర్ కోదండరాం నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యమకారుల సమస్యలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆయనను కోరారు. హైదరాబాద్ వెళ్ళిన వారిలో బాన్సువాడ మండల ఉద్యమకారుల ఫోరం సభ్యులు ఉన్నారు.