రుద్రూర్ మండల కేంద్రంలో ఎన్‌పీఆర్డీ ఆధ్వర్యంలో దివ్యాంగులు తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం ముట్టడించారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేల పెన్షన్ ఇవ్వాలని కోరారు. అనంతరం తహశీల్దార్ మీరాబాయికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులు మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు దివ్యాంగులకు రూ. 6 వేలు పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు.