ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

71చూసినవారు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద ప్రభుత్వ డిగ్రీ కళాశాల అటానమస్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపాల్ కె. అశోక్ జాతీయ జెండాను ఎగరవేశారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రిన్సిపల్ మాట్లాడుతూ స్వాతంత్రం కోసం అమరుల త్యాగాలను గుర్తు చేశారు. విద్యార్థులు సమయపాలన పాటిస్తూ, క్రమశిక్షణతో కళాశాలకు రావాలని సూచించారు. దేశాభివృద్ధిలో యువకుల పాత్రను గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్