జుక్కల్: పేకాట స్థావరంపై పిట్లం పోలీసులు దాడి

85చూసినవారు
జుక్కల్: పేకాట స్థావరంపై పిట్లం పోలీసులు దాడి
పిట్లం మండలం కరేగాం గ్రామ శివారులో కొందరు వ్యక్తులు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పిట్లం ఎస్ఐ రాజు సిబ్బందితో కలిసి సోమవారం దాడి చేసి ఆరుగురు జూదరులను పట్టుకున్నారు. వారి నుంచి రూ. 6,960 నగదు మరియు రెండు ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు పిట్లం ఎస్ఐ తెలిపారు. పేకాట ఆడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్