జుక్కల్: పదవీ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ కు సన్మానం

79చూసినవారు
జుక్కల్: పదవీ విరమణ పొందిన జూనియర్ అసిస్టెంట్ కు సన్మానం
కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని లాడేగాం గ్రామానికి చెందిన దేవకతే శంకర్రావు పటేల్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించి ఇటీవల పదవి విరమణ పొందారు. ఈ సందర్భంగా లాడేగాం గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆదివారం శంకర్రావు పటేల్ దంపతులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అశ్విని రాజశేఖర్ పటేల్, విజయ్ పటేల్, అవుటి పండరి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్