నిజంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాజెక్టు అయిన సింగూరు ప్రాజెక్టు నుండి, ఎగువ ప్రాంతాల నుండి 12, 210 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏఈఈ శివప్రసాద్ బుధవారం తెలిపారు. నిజంసాగర్ ప్రాజెక్టు మూడు ప్రధాన వరద గేట్ల ద్వారా దిగువనగల మంజీరా నదిలోకి అంతే స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ దిగువనగల పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.