నిజాంసాగర్ మండలంలోని ఆరేడు గ్రామంలో రోడ్డుపై మురికి కాలువ పారడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆగస్టు నెల ఐదో తారీకు నుంచి పదో తారీకు వరకు పచ్చదనం స్వచ్ఛదనం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించినప్పటికీ అధికారులు నామ్ కి వాస్తే అన్నట్టు పనులు చేసినట్టు ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.