పిట్లం మండలం గౌరారం తాండ గ్రామంలో సోమవారం కుటుంబ సర్వేను పిట్లం మండల ఎంపీఓ యాదగిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ సర్వేను గ్రామంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, బతుకుదెరువు కోసం పట్టణాలకు వెళ్లిన కుటుంబీకులకు సమాచారం అందించాలని, సర్వే చేపడుతున్న సిబ్బంది అన్ని వివరాలు సమగ్రంగా నమోదు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రెటరీ వాగ్దేవి, కారోబర్ సర్దార్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.