స్వచ్ఛదనం పచ్చదనం అంటే ఇలానేనా

66చూసినవారు
స్వచ్ఛదనం పచ్చదనం అంటే ఇలానేనా
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఆగస్టు 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగింది. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో, ఐకెపి కార్యాలయాల చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిన అధికారులు కార్యాలయాన్ని శుభ్రం చేసుకునే పరిస్థితి లేదు. తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోలేని అధికారులు గ్రామాలను ఏ విధంగా శుభ్రం చేస్తారని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం ఇలానే ఉంటుందా అని విమర్శిస్తున్నారు.