మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది

55చూసినవారు
మంటలను ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
అజాగ్రత్తగా పొగ తాగి పడేయడంతో కామారెడ్డి పట్టణంలోని ఎన్జీవోస్ కాలనీ 14వ వార్డులో ఆదివారం మంటలు చెలరేగాయి. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి వెంటనే స్పందించి ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కాలనీవాసులకు ఇబ్బంది కలుగకుండా చూశారు.